ఒమిక్రాన్ భయమున్నా.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు !

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న అంశంపై ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం .. కేంద్ర ఆరోగ్యశాఖతో భేటీ అయ్యింది. ఆ సమయంలో పలు అంశాలను అధికారులు చర్చించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం లేనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జఅయిదు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు కొన్ని ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో మంగళవారం యూపీలో ఎన్నికల సంఘం అధికారులు పరిశీలనకు వెళ్లనున్నారు. ఎన్నికల వేళ రక్షణ కల్పించే పారామిలిటరీ దళాల చీఫ్‌లతోనూ ఎన్నికల సంఘం భేటీకానున్నది. వ్యాక్సిన్ కవరేజీ గురించి కూడా ఇవాళ జరిగిన భేటీలో ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఒమిక్రాన్ టాప్ గేర్‌లో ఉన్నా.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మరోసారి భేటీ..
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. అయితే వచ్చే సంవత్సరం జనవరి 22న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం తర్వాతే ఎన్నికలను నిర్వహించాలా? వద్దా? అన్న విషయంలో ఈసీ తుది నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్సు ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

