భర్తను చంపి.. కాల్వలో పడేసి!.. ప్రియుడితో కలసి భార్య దారుణం
హర్యానాలోని రేవారీలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జార్తల్ గ్రామానికి చెందిన మోను(21) అనే యువకునికి కసోలి గ్రామానికి చెందిన తన్ను అనే యువతికి ఇటీవలే వివాహం జరిగింది.
గురుగ్రామ్: హర్యానాలోని రేవారీలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జార్తల్ గ్రామానికి చెందిన మోను(21) అనే యువకునికి కసోలి గ్రామానికి చెందిన తన్ను అనే యువతికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ వివాహం ఇష్టం లేని తన్ను తన ప్రియుడు సోనుతో ప్రేమాయణాన్ని కొనసాగించేందుకు, అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ప్రియుని సహకారం తీసుకుంది. జూన్ 8న రాత్రి ఏదో పనిమీద స్కూటర్పై వెళ్లిన మోనుకు అతని భార్య తన్ను ఫోన్ చేసి, కసోలి గ్రామానికి రమ్మని చెప్పింది. అక్కడ అప్పటికే ఆమె ప్రియుడు సోను పంపిన హరిఓం, అమన్లు మాటువేసి ఉన్నారు.
మోను అక్కడికి రాగానే వారు అతనిపై దాడి చేసి, తరువాత అసల్వాస్ కాలువలో పడేశారు. మర్నాడు మోను కనిపించకపోవడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అసల్వాస్ కాలువలో మోను మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతుని భార్య తన్నును, ప్రియుడు సోనును విచారించారు. దీంతో ఈ హత్య వెనుక కుట్ర బయట పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

