నూతన జంటకు బహుమతిగా పెట్రోల్, డీజిల్
wedding gift | పెట్రోల్, డీజిల్.. ఇప్పుడు వీటి పేరు వింటేనే జనాలు భయపడిపోతున్నారు. గత 16 రోజుల్లో 14 సార్లు వీటి ధరలు పెరగడంతో మరింత ప్రియం అయ్యాయి. వరుసగా ధరలు పెరుగుతుండటంతో తాజాగా అవి బహుమతుల జాబితాలో చేరాయి.
చెన్నై: పెట్రోల్, డీజిల్.. ఇప్పుడు వీటి పేరు వింటేనే జనాలు భయపడిపోతున్నారు. గత 16 రోజుల్లో 14 సార్లు వీటి ధరలు పెరగడంతో మరింత ప్రియం అయ్యాయి. వరుసగా ధరలు పెరుగుతుండటంతో తాజాగా అవి బహుమతుల జాబితాలో చేరాయి. ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు లీటర్ పెట్రోల్, డీజిల్ బహుమతిగా ఇచ్చారు. పెట్రో ధరలు మండిపోతున్న వేళ వారిచ్చిన గిఫ్ట్ అందరినీ ఆశ్చర్యపరించిది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తమిళనాడులోని చంగల్పట్టు జిల్లా చెయ్యూరులో గిరీశ్ కుమార్, కీర్తన జంట వివాహ వేడుక జరుగుతున్నది. అంతా వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. వారి స్నేహితులు ఓ కవర్లో నుంచి రెండు లీటర్ బాటిళ్లు తీశారు.. పెట్రోల్, డీజిల్‌తో ఉన్న ఆ బాటిళ్లను ఇద్దరి చేతిలో పెట్టి వారిని సర్ప్రైజ్ చేశారు.
Amidst rising #PetrolDieselPriceHike, friends of the newly married couple, Girish Kumar and Keerthana decided to gift the couple One Litre #petrol and One Litre #diesel as a wedding present at their Wedding reception in Cheyyur in Chengalpattu district #FuelPriceHike pic.twitter.com/Wr3BErZUwg
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) April 7, 2022
గతంలో కూడా ఓ వివాహ వేడుకలో నూతన జంటకు పెట్రోల్ డబ్బాతోపాటు సిలిండర్, ఉలిగడ్డలు బహుమతిగా ఇచ్చారు. గత కొంతకాలంగా నిత్యావరసరాలైన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దీంతో వేడుకల్లో వాటిని తమకు స్నేహితులకు గిఫ్ట్‌గా ఇవ్వడం తరచుగా జరుగుతూనే ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

