పాట్నా: ప్రభుత్వ హాస్పిటల్ నుంచి నవజాత శిశువును ఒక మహిళ ఎత్తుకెళ్లింది. అంతా చూస్తుండగానే చాలా దర్జాగా పసి బిడ్డను చోరీ చేసింది. (Woman Stole newborn) ఆసుపత్రిలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లోహియా నగర్‌కు చెందిన నందినీ దేవి ఆదివారం బేగుసరాయ్‌లోని సదర్ హాస్పిటల్లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే నవజాత శిశువును తల్లికి నర్సులు అప్పగించలేదు. ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్లో ఉంచారు.
కాగా, ఆదివారం సాయంత్రం 7 గంటలకు శిశివుకు పాలు పట్టేందుకు కుటుంబ సభ్యులు ఆ యూనిట్లోకి వెళ్లారు. అయితే పసి బిడ్డ కనిపించకపోవడంతో వారు ఆందోళన చెందారు. శిశివు మిస్సింగ్ గురించి హాస్పిటల్ సిబ్బందిని నిలదీశారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్లోకి ప్రవేశించిన ఒక మహిళ పసి బిడ్డను ఎత్తుకెళ్లినట్లు గ్రహించారు. మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆమె ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నవజాత శిశువును మహిళ ఎత్తుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बिहार के बेगूसराय से एक चौंकाने वाली घटना सामने आई है, जहां सदर अस्पताल के SNCU वार्ड से एक नवजात शिशु की चोरी कर ली गई। एक बुजुर्ग महिला SNCU में प्रवेश करती है और बच्चे को कपड़े में लपेटकर बाहर ले जाती है। घटना की गंभीरता को देखते हुए पुलिस मामले की जांच कर रही है।#Begusarai pic.twitter.com/TOPM7H7mDg
— Panchayati Times (@panchayati_pt) September 16, 2024