న్యూఢిల్లీ, ఆగస్టు 13: కేంద్ర మంత్రివర్గం పాన్ 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతమున్న పాత పాన్ కార్డు స్థానంలో మీకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాన్ కార్డు లభిస్తుంది. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన డిజిటల్ అనుభూతిని కల్పించడమే కొత్త పాన్ కార్డు లక్ష్యం. దీంతో పాన్/ట్యాన్ సేవలు సులభతరమవడంతోపాటు సురక్షితమవుతాయి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పాత పాన్ కార్డు 1972 నుంచి వాడుకలో ఉన్నది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 78 కోట్లకుపైగా పాన్ కార్డులు జారీ అయ్యాయి.
పన్ను చెల్లింపుదారులకు ఉచితం
క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌ను జారీ చేయనున్నామని, పన్ను చెల్లింపుదారులకు దీనిని ఉచితంగా జారీచేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కొత్త కార్డులో నెంబర్ పాతదే ఉంటుందన్నారు.