Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంటుంది. నవంబర్ 19న లేదా నవంబర్ 20 కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరనుంది. పట్నాలోని గాంధీ మైదానంలో ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్‌ను బట్టి ఈ రెండు తేదీల్లోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉండనుందని సమాచారం.
బిహార్ అసెంబ్లీకి జరిగిన 18వ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లు గెలుపొంది అధికారాన్ని నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జాబితాను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ (Rajendra Arlekar)కు ఎన్నికల సంఘం సమర్పించనుంది. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన రానుంది. ఎన్నికల్లో విజయదుంధుబి మోగించిన నితీశ్ కుమార్ నవంబర్ 17న సోమవారం క్యాబినెట్‌తో సమావేశం కానున్నారు.
ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్నారు. గెలుపొందిన ఎన్డీఏ అభ్యర్ధులు సమావేశమై తమ కూటమి నాయకుడిని ఎన్నుకుంటారు. అందరూ అమోదించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గత పదమూడు పర్యాయాలు బిహార్‌ను ఏలుతున్న నితీశ్ మరోసారి సీఎం కుర్చీలో కూర్చోవడం లాంఛనమే కానుంది.
Nitish Kumar @NitishKumar already predicted the result and today Bihar has proved him right 🔥
#BiharElection2025 | #NitishKumar pic.twitter.com/npZiTVAaWW— Nikhil saini (@iNikhilsaini) November 14, 2025
యావత్ దేశం ఆసక్తికనబరిచిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి రావాలనుకున్న మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్లో నితీశ్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోని ఎన్డేఏ 202 స్థానాల్లో గెలుపొందింది.. మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాఘట్బంధన్ బలపరిచిన సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) విజయం సాధించారు. కానీ, ఆయనకు అధికారం మరోసారి కలగానే మిగిలింది. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయనేతగా రాణించాలనుకున్న ప్రశాంత్ కిశోర్‌ను ఓటర్లు తిరస్కరించారు. ఇక చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.