న్యూఢిల్లీ: భారత దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే ఎంజీనరేగా చట్టం స్థానంలో పలు మార్పులతో కొత్త చట్టం తేవడం చారిత్రక తప్పిదంగా పలువురు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఒక బహిరంగ లేఖను కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పంపారు. బార్డ్ కాలేజీకి చెందిన ఎకనామిక్స్ ఇనిస్టిట్యూట్ కూర్చిన ఈ లేఖలో ఎంజీనరేగా చట్టం రద్దు చర్యను ‘నిర్మాణాత్మక విధ్వంసం, చారిత్రక తప్పిదంతో పోల్చారు.
కొత్త చట్టం రాష్ర్టాల మీద భరించలేని బాధ్యతలను మోపుతున్నదని విమర్శించారు. ఈ బహిరంగ లేఖపై సంతకం చేసిన వారిలో ఐరాస ప్రత్యేక నివేదికుడు అలివర్ డె షట్టర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రొఫెసర్ జేమ్స్ గాల్బ్రైత్, యూఎస్ ప్రొఫెసర్ డెరీక్ హమిల్టన్, లండన్ ప్రొఫెసర్ మరియానా మజుకాటో ..తదితరులు ఉన్నారు.