న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో ఏసీల వినియోగానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నది. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు ఏసీల కనిష్ఠ టెంపరేచర్‌పై పరిమితులు విధించనున్నది. కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా కొత్తగా తయారయ్యే ఏసీలకు ప్రామాణిక నిబంధనలు అమలు చేయనున్నది.
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ఈ కొత్త విధానాన్ని త్వరలో అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఉష్ణోగ్రతల సెట్టింగ్‌లను ప్రామాణీకరించడానికి దీనిని మొదటిసారిగా ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని, దీని ప్రకారం భవిష్యత్తులో ఎయిర్ కండిషనర్లు 20-28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య మాత్రమే పనిచేస్తాయని తెలిపారు.