న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. (Kapil Sibal On Dhankhar) ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. శుక్రవారం మీడియాతో కపిల్ సిబల్ మాట్లాడారు. ‘లోక్సభలో స్పీకర్ కుర్చీ స్థానం గురించి అందరికీ తెలుసు. ఆయన లేదా ఆమె ఒక పార్టీ స్పీకర్ కాదు. వారు ఓటు కూడా వేయరు. టై అయినప్పుడు మాత్రమే ఓటు వేస్తారు. ఎగువ సభలోనూ అదే. ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య సమాన దూరంలో మీరు ఉన్నారు. మీరు చెప్పేదంతా సమ దూరంలో ఉండాలి. ఏ స్పీకర్ కూడా పార్టీ ప్రతినిధి కాలేరు. ఆయన (ధన్ఖర్) అలా కనిపిస్తే స్పీకర్ కుర్చీ పరువు దిగజారుతుంది’ అని అన్నారు.
కాగా, జగ్దీప్ ధన్ఖర్ వ్యాఖ్యలపై తాను బాధపడటంతోపాటు ఆశ్చర్యపోయినట్లు కపిల్ సిబల్ తెలిపారు. నేటి కాలంలో దేశవ్యాప్తంగా విశ్వసించే సంస్థ ఏదైనా ఉందంటే అది న్యాయవ్యవస్థ మాత్రమేనని అన్నారు. ‘రాష్ట్రపతి నామమాత్రపు అధిపతి మాత్రమే. మంత్రివర్గ అధికారం, సలహా మేరకు వ్యవహరిస్తారు. రాష్ట్రపతికి వ్యక్తిగత అధికారాలు ఉండవు. ఎగ్జిక్యూటివ్ తన పనిని చేయకపోతే, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. అది వారి హక్కు. న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం ఈ దేశంలోని ప్రజాస్వామ్యానికి ప్రాథమికమైనది’ అని సిబల్ అన్నారు.
మరోవైపు గురువారం యువ ఎంపీలను ఉద్దేశించి జగ్దీప్ ధన్ఖర్ మాట్లాడారు. రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలకు కాలపరిమితి విధించిన న్యాయవవ్యస్థ ‘సూపర్ పార్లమెంట్’గా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ప్రజాస్వామ్య శక్తులపై సుప్రీంకోర్టు ‘అణు క్షిపణి’ని ప్రయోగించరాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జగ్దీప్ ధన్ఖర్పై ప్రతిపక్షాలు మండిపడ్దాయి.
#WATCH | Delhi | On Vice President Jagdeep Dhankhar’s statement, Senior advocate and Rajya Sabha MP Kapil Sibal says, “I was saddened and surprised to see Jagdeep Dhakhar’s statement. If any institution is trusted throughout the country in today’s time, it is the judiciary. When… https://t.co/69pbTeMYEK pic.twitter.com/ccvhS2bqj9
— ANI (@ANI) April 18, 2025