న్యూఢిల్లీ, అక్టోబర్ 31: స్మార్ట్ఫోన్లలో ఐదు యాప్‌లను డిలీట్ చేయాలంటూ నెదర్లాండ్‌కు చెందిన ‘థ్రెట్ ఫ్యాబ్రిక్’ హెచ్చరించింది. ఆ యాప్స్‌లో కొత్త ట్రోజన్ మాల్వేర్ను గుర్తించామని, అది యూజర్ బ్యాంకింగ్ లాగిన్ సమాచారం, ఖాతా నంబర్, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కొల్లగొట్టే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో 1.ఫైల్ మేనేజర్ స్మాల్, లైట్, 2.మై ఫైనాన్సెస్ ట్రాకెర్, 3.కోడిక్ ఫిస్కేల్ 2022, 4.జెట్టర్ అథెంటికేటర్, 5.రికవర్ ఆడియో, ఇమేజెస్, వీడియోస్ అనే యాప్‌లు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని హెచ్చరించింది.