న్యూఢిల్లీ: హెచ్1-బీ వీసా(H1-B Visa) ఫీజును ట్రంప్ సర్కారు లక్ష డాలర్లకు పెంచడాన్ని నెట్‌ఫ్లిక్స్ సహవ్యవస్థాపకుడు రీడ్ హ్యాస్టింగ్స్ స్వాగతించారు. ఈ అంశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆయన ప్రశంసలు కురిపించాడు. విదేశీ వర్కర్లను జాబ్‌లోకి తీసుకుంటున్న కంపెనీలకు హెచ్1-బీ వీసా ఫీజు పెంపుతో అందర్నీ షాక్‌లోకి నెట్టేశారు ట్రంప్. వివాదాస్పదంగా మారిన ఆ నిర్ణయంపై అనేక మంది తమ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నెట్‌ఫ్లిక్స్ కోఫౌండర్ రీడ్ హాస్టింగ్స్ మాత్రం సుముఖత వ్యక్తం చేశారు.
హెచ్1-బీ రాజకీయాలపై 30 ఏళ్లు పనిచేశానని, హెచ్1-బీ వీసా కోసం ట్రంప్ ప్రభుత్వం లక్ష డాలర్లు వసూల్ చేయడం గొప్ప పరిష్కారమని ఆయన అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. హెచ్1-బీ వీసా ఫీజు పెంపు కేవలం హై వాల్యూ జాబ్‌లకే వర్తిస్తుందని అన్నారు. ఇక నుంచి వీసాల కోసం లాటరీలు అవసరం ఉండదని, ఉద్యోగాలకు కూడా ఢోకా ఉండదని ఆయన అన్నారు.
ట్రంప్ వీసా ఫీజు పట్ల మద్దతు ప్రకటించిన హాస్టింగ్స్ ఆ నిర్ణయం అకస్మాత్తుగా జరిగిందన్నారు. వాస్తవానికి గతంలో ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని హాస్టింగ్స్ వ్యతిరేకించేవారు.
I’ve worked on H1-B politics for 30 years. Trump’s $100k per year tax is a great solution. It will mean H1-B is used just for very high value jobs, which will mean no lottery needed, and more certainty for those jobs.
— Reed Hastings (@reedhastings) September 21, 2025