కోల్కతా, జూలై 28: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తెప్పించాలని ఆయన మనుమడు చంద్రకుమార్బోస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ దేవాలయంలో భద్రపర్చిన నేతాజీ అవశేషాలను ఆగస్టు 18వ తేదీ కల్లా భారత్కు రప్పించాలని కోరారు. బోస్ మరణంపై ఉన్న తప్పుడు కథనాలకు తెరదించుతూ కేంద్రం నిజాలు వెల్లడిస్తూ ప్రకటన చేయాలని కోరారు. పరాయి గడ్డపై నేతాజీ అస్థికలు ఉండటం దేశానికి ఎంతో అవమానమని ఆయన పేర్కొన్నారు.