ఆదివారం 07 మార్చి 2021
National - Jan 23, 2021 , 12:47:55

ఆశ‌యాల‌ను కాల‌రాసి విగ్రహారాధ‌న చేస్తే సరిపోతుందా..?: మ‌మ‌తాబెన‌ర్జి

ఆశ‌యాల‌ను కాల‌రాసి విగ్రహారాధ‌న చేస్తే సరిపోతుందా..?: మ‌మ‌తాబెన‌ర్జి

కోల్‌క‌తా: నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ముందుచూపున్న మ‌హానాయ‌కుడ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి గుర్తుచేసుకున్నారు. నేతాజీ 125వ జ‌యంతి సంద‌ర్భంగా కోల్‌క‌తాలోని శ్యామ్ బ‌జార్ నుంచి రెడ్ రోడ్ వ‌ర‌కు జ‌రిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న మ‌మ‌తాబెన‌ర్జీ ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. స్వ‌తంత్ర్య భార‌త‌దేశానికి ప్ర‌ణాళికా సంఘం, ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ ఆవ‌శ్య‌క‌త‌ను నేతాజీ స్వాతంత్ర్యానికి పూర్వ‌మే ఊహించార‌ని మ‌మ‌తాబెన‌ర్జి చెప్పారు. 

అయితే, నేతాజీ సుభాష్‌చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును మ‌మ‌తాబెన‌ర్జీ త‌ప్పుబ‌ట్టారు. నేతాజీపై నిజంగా గౌరవం ఉంటే ఆయ‌న ఆశ‌యాల‌ను తూచా త‌ప్ప‌కుండా నెర‌వేర్చాల‌ని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం నేతాజీ ముందు చూపుతో ఏర్పాటైన ప్ర‌ణాళికా సంఘాన్ని ర‌ద్దుచేసి ఆయ‌న విగ్రహాల‌ను మాత్రం ఆరాధిస్తున్న‌ద‌ని ఆమె ఎద్దేవా చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo