Uttarakhand : నేపాలీలు మళ్లీ భారత్‌కు చెందిన కూలీలపై దాడికి తెగబడ్డారు. ఇరు దేశాల మధ్య ఉత్తరాఖండ్‌లోని ధూర్చూల్ సరిహద్దు నగరంలో కాళీ నది చుట్టూ రక్షణ గోడ కడుతున్న భారతీయ వర్కర్లపై శుక్రవారం నేపాల్ దేశస్థులు రాళ్ళు విసిరారు. వాళ్ల దాడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు. భారతీయ కూలీలపై నేపాలీలు మరొకసారి దాడి చేశారు అని జలవనరుల శాఖ ప్రత్యేక డివిజన్ అధికారి ఫర్హాన్ అహ్మద్ తెలిపారు. ఈ సంఘటనలో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. నేపాలీలు రాళ్లు రువ్వడంతో రెండు డంపర్లు, రెండు టిప్పర్ వాహనాలు అద్దాలు పగిలాయి.
కాళీ నది నేపాల్, భారత్ మధ్య ప్రవహిస్తుంది. దాంతో ఆ నది పక్కన రక్షణ గోడ కట్టడాన్ని నేపాల్‌లోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని వారాలుగా నేపాలీలు, భారత కార్మికులపై దాడులకు పాల్పడుతున్నారు.