Nepal Earthquake: 128కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. నేపాల్ ప్రజలకు మోదీ సంతాపం
Nepal Earthquake: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 128కి చేరింది. దాదాపు 155 మంది గాయపడ్డారు. భూకంప బాధిత కుటుంబాలకు భారత ప్రధాని సంతాపం తెలిపారు. విషాద సమయంలో ఆ దేశానికి అండగా ఉండనున్నట్లు ఆయన తన ట్విట్టర్లో తెలిపారు. జాజర్కోట్ కేంద్రంగా శుక్రవారం రాత్రి 6.4 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే.
ఖాట్మాండు: నేపాల్ భూకంపం(Nepal Earthquake)లో మృతిచెందిన వారి సంఖ్య 128కి చేరింది. శుక్రవారం పశ్చిమ నేపాల్‌లోని జాజర్కోట్ కేంద్రంగా భూమి కంపించింది. దేశరాజధాని ఖాట్మాండుకు 500 కిలోమీటర్ల దూరంలో జాజర్కోట్ ఉంది. నేపాల్ రాజధానితో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. జాజర్కోట్ ఆస్పత్రి గాయపడ్డవారితో నిండిపోయింది.
నేపాల్ భూకంప మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. నేపాల్ ప్రజలకు సంఘీభావంగా భారత్ నిలుస్తుందని ఆయన తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు. అన్ని రకాలుగా ఆ దేశాన్ని ఆదుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
శుక్రవారం రాత్రి 11.47 నిమిషాలకు 6.4 తీవ్రతతో భూమి కంపించింది. జాజర్‌కోట్‌లోని బేరికోట్ రూరల్ మున్సిపాల్టీ పరిధిలోని రామిదండ కేంద్రంగా భూకంపం వచ్చింది. జాజర్‌కోట్‌లో 92 మంది మృతిచెందగా, 70 మంది గాయపడ్డారు. ఇక రుకుమ్ వెస్ట్ ప్రాంతంలో 36 మంది మృతిచెందగా, 85 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఆర్మ్డ్ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
Deeply saddened by loss of lives and damage due to the earthquake in Nepal. India stands in solidarity with the people of Nepal and is ready to extend all possible assistance. Our thoughts are with the bereaved families and we wish the injured a quick recovery. @cmprachanda
— Narendra Modi (@narendramodi) November 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

