Manohar Lal Khattar | జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. నెహ్రూ దేశానికి యాక్సిడెంటల్‌గా తొలి ప్రధాని అయ్యారని ఆదివారం హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు.
VIDEO | “I want to say that Pandit JL Nehru became a prime minister by accident. In his place, someone who deserved it (to become India’s first PM) was Sardar Vallabhbhai Patel and Dr BR Ambedkar,” says Union Minister Manohar Lal Khattar (@mlkhattar), while addressing a gathering… pic.twitter.com/vJwwlEyGhr
— Press Trust of India (@PTI_News) January 12, 2025
హర్యానాలోని రోహ్తక్లోని ఓ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. ‘నెహ్రూ అనుకోకుండా ప్రధాని అయ్యారని చెప్పదలుచుకున్నా.. ఆయన స్థానంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రధాని పదవికి అర్హులు’అని వ్యాఖ్యానించారు.
VIDEO | “He himself became an accidental chief minister and that’s why he is talking like this,” says Congress leader Bhupinder Singh Hooda (@BhupinderShooda) on Union Minister Manohar Lal Khattar’s ‘JL Nehru became PM by accident’ remark.
(Full video available on PTI Videos -… pic.twitter.com/MrAZ9PBs7V
— Press Trust of India (@PTI_News) January 12, 2025
మనోహర్‌లాల్ ఖట్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హుడా మండి పడ్డారు. ఆయనే (ఖట్టర్) అనుకోకుండా హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందు వల్లే ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వ విజయాలేమీ లేవన్నారు. పదేండ్లుగా అధికారంలో ఉన్నా వ్యక్తిగత ఆదాయంలోనూ, ఉద్యోగాల కల్పనలోనూ, పెట్టుబడుల్లోనూ వెనుక బడిందన్నారు.