న్యూఢిల్లీ, జూన్ 7: నీట్ యూజీ-2026 పేపర్ లీక్‌తో పరీక్ష విధానంలోని దుర్భలత బట్టబయలై అపహాస్యం పాలైన నేతృత్వంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పకడ్బందీగా పరీక్ష పేపర్లను రూపొందించాలని నిర్ణయించింది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం నీట్, జేఈఈ లేదా ఈ సంస్థ నిర్వహించే మరో ఇతర పరీక్షకైనా సరే, వచ్చే ఏడాది పరీక్ష కోసం తాము రూపొందించే ప్రశ్నపత్రాల గురించి సబ్జెక్టు నిపుణులకు ముందుగాతెలిసే అవకాశం ఉండదు.
జీరో-ట్రస్ట్ ఆర్కిటెక్చర్‌గా దీన్ని పిలుస్తున్నారు. అంటే, ఏ ఎగ్జామ్‌కు ప్రశ్నపత్రం రూపొందిస్తున్నారో సబ్జెక్ట్ నిపుణులకు ముందుగా తెలియదన్నమాట.