DK Shivakumar : ‘నీట్ యూజీ – 2026 (NEET UG – 2026)’ పరీక్ష పేపర్ లీకవడం, దాంతో కేంద్రం పరీక్షను రద్దు చేయడం దేశానికే సిగ్గుచేటని కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivkumar) అన్నారు. కేంద్రం నిర్ణయం (Union Govt Decision) లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేసిందని అన్నారు. వారంతా బాధపడుతున్నారని చెప్పారు.
ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే విద్యారంగంలో భారతదేశం తీరు అధ్వాన్నంగా ఉన్నదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు నీట్ పరీక్ష రద్దుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారెవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. అదే ఏదైనా రాష్ట్రంలో ఇలాంటివి జరిగితే ప్రధాని సహా కేంద్రమంత్రులంతా మాటల దాడి చేస్తారని మండిపడ్డారు. ఇప్పుడు వాళ్లు ఎందుకు నోళ్లు తెరవడం లేదని ప్రశ్నంచారు.
#WATCH | Bengaluru | On paper leak in NEET-UG 20026 exam, Karnataka Dy CM DK Shivakumar says, “It’s a great shame on India. All the students’ parents are annoyed. They are suffering… In the international arena, our country has become very shabby in education. The parliament… pic.twitter.com/NrArGFumaH
— ANI (@ANI) May 13, 2026