NEET UG 2024 | నీట్ యూజీ-2024 ఫలితాలపై వివాదం చెలరేగుతున్నది. ప్రతియేటా ఎంబీబీఎస్ తదితర వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. నీట్-యూజీ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో వచ్చిన మార్కుల పర్సంటైల్ ఆధారంగా ర్యాంకులు నిర్ణయిస్తారు. కానీ, ఈ ఏడాది నీట్-యూజీ 2024 నిర్వహణలో పలు అవకతవకలు జరిగినట్లు, ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో నీట్ అభ్యర్థుల భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నయి. నీట్ యూజీ-2024లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 67 మంది విద్యార్థులకు అఖిల భారత స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వారిలో రాజస్థాన్ విద్యార్థి దేవేష్ జోషి ఉన్నాడు. ఆయనకు నీట్ పరీక్షలో 720/720 మార్పులు వచ్చాయి.
రాజస్థాన్ లోని కరౌలి జిల్లా తొడాభీమ్ జిల్లాకు చెందిన దేవేష్ జోషి.. నీట్ యూజీ పరీక్ష రాయడం ఇది రెండోసారి. చిన్నప్పటి నుంచే వైద్యుడ్ని కావాలని కలలు కంటున్నాడు. అలా కష్ట పడటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు, దేవేశ్ జోషి నీట్ రిజల్ట్ సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో వైరలైంది. వేల మంది లైక్స్, కామెంట్స్ చేశారు.
2006 మార్చి 30న జన్మించిన దేవేశ్ జోషి.. ఈసారి జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీలో నీట్ పరీక్షకు హాజరయ్యాడు. ఆయనకు 99.9971285 శాతం మార్కులొచ్చాయి. తాను ఈ మైలురాయిని చేరుకోవడానికి తల్లిదండ్రులు, స్నేహితుల సహకారమే కారణం అని దేవేష్ జోషి. స్థానిక కోచింగ్ సెంటర్లో చదువుతూ ఆరేడు గంటలు ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. తొలిసారి నీట్ యూజీ పరీక్ష రాసినప్పుడు 412 మార్కులకు ఎంబీబీఎస్ లో సీట్ రాలేదు. కానీ ఆయన తన విశ్వాసాన్ని కోల్పోకుండా రెండోసారి మరింత అంకిత భావంతో చదివానని చెప్పాడు. ఆయన నీట్ రిజల్ట్ ప్రకారం ఫిజిక్సులో 99.9679852 శాతం, కెమిస్ట్రీలో 99.8618693 శాతం, బయాలజీలో 99.9089272 శాతం మార్కులు వచ్చాయి.