న్యూఢిల్లీ: నీట్ పీజీ-2025 నిర్వహణను ఆగస్టు 3కు వాయిదా వేయాలన్న జాతీయ పరీక్షల బోర్డ్(ఎన్బీఈ) విజ్ఞప్తికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. సాంకేతిక పరిమితుల ఆధారంగా ఎన్బీఈ విజ్ఞప్తిని అంగీకరించినట్టు కోర్టు పేర్కొన్నది. పరీక్ష నిర్వహణకు ఆగస్టు 3 కంటే ఎక్కువ పొడిగింపును మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.
ఒకే షిప్ట్‌లో పరీక్ష నిర్వహించాలని, రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించడం వల్ల వివిధ స్థాయిల్లో ఇబ్బందులు కలగవచ్చని పిటిషనర్ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ చేసిన వాదనతో సుప్రీంకోర్ట్ అంగీకరించి ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ నిర్వహించాలని ఎన్‌బీఈని ఆదేశించింది. అయితే ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని, భద్రతా చర్యలు చేపట్టాలని.. ఇందుకోసం పరీక్ష నిర్వహణ గడువును పెంచాలని ఎన్బీఈ కోర్టును కోరింది.