ఉసురుతీస్తున్న ‘నీట్’
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం ఏటా నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విద్యార్థుల ఉసురుతీస్తున్నది. గత రెండు రోజుల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన రియాకుమారి, రాజస్థాన్‌లోని సికర్‌కు చెందిన ఉమేశ్ మాలి, ఢిల్లీకి చెందిన రేణు రీఎగ్జామ్‌కు ముందు బలవన్మరణానికి పాల్పడ్డారు.
- పరీక్ష సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం
- పోటీ, ఒత్తిడితో విద్యార్థుల చిత్తు
- ఐదేండ్లలో సుమారు వంద మరణాలు
- గత రెండ్రోజుల్లో ముగ్గురి ఆత్మహత్య
న్యూఢిల్లీ, జూన్ 17: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం ఏటా నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విద్యార్థుల ఉసురుతీస్తున్నది. గత రెండు రోజుల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన రియాకుమారి, రాజస్థాన్‌లోని సికర్‌కు చెందిన ఉమేశ్ మాలి, ఢిల్లీకి చెందిన రేణు రీఎగ్జామ్‌కు ముందు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఏటా పెరుగుతున్న మరణాలు
దేశంలో 2021 నుంచి చూస్తే సుమారు వంద మంది విద్యార్థులు ఉసురు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. డాక్టర్ కావాలన్న యువత కలలను ప్రభుత్వం తన నిర్లక్ష్య చర్యలతో నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నది. ఒక ఆంగ్లమీడియా కథనం ప్రకారం గత ఐదేండ్లలో సుమరు వంద నీట్ సంబంధ మరణాలు చోటుచేసుకున్నాయి. అయితే ఇవి అధికారికంగా నమోదైన మరణాలు మాత్రమే. లెక్కల్లోకి రాని మరణాలు పదుల సంఖ్యలో ఉంటాయని అంచనా. గత ఐదేండ్లలో దేశవ్యాప్త మరణాల్లో రాజస్థాన్‌లోని కోచింగ్ హబ్ అయిన కోటాలో 40 మంది మరణించగా, తర్వాతీ స్థానాల్లో పాట్నాలో ఏడు, సికర్‌లో ఆరు మరణాలు చోటుచేసుకున్నాయి.
ఆత్మహత్యలకు కారణాలేంటి?
వైద్య కోర్సుల్లో సీట్ తెచ్చుకోలేమన్న దిగులే విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. కోచింగ్ సంస్థల ఒత్తడి, తీవ్రమైన పోటీ, విఫలమవుతామన్న భయం ఇవన్నీ ఆ విద్యార్థిని గందరగోళంలోకి నెడుతూ ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారని నిపుణులు అంటున్నారు.
విద్యార్థుల మరణాలు
2018-11
2019-7
2020-14
2021-4
2022-9
2023-15
2024-19
2025-32
2026- 18
(ఇప్పటివరకు)
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

