NEET Aspirant Suicide | నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. 650 మార్కులు ఆశించాడన్న తండ్రి
NEET Aspirant Suicide | దేశ వ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష రాసిన అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీట్ రద్దుతో మనస్తాపం చెందిన అతడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
జైపూర్: దేశ వ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష రాసిన అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీట్ రద్దుతో మనస్తాపం చెందిన అతడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. (NEET Aspirant Suicide) నీట్ ఎగ్జామ్‌లో 650 మార్కులు వస్తాయని తన కుమారుడు చెప్పినట్లు తండ్రి వాపోయారు. కనికా కి ధాని గ్రామానికి చెందిన ప్రదీప్ మేఘ్వాల్, గత మూడేళ్లుగా తన ఇద్దరు సోదరీమణులతో కలిసి సికార్‌లో నివసిస్తున్నాడు. నీట్ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు. మే 3న నీట్ పరీక్ష రాశాడు.
కాగా, పేపర్ లీక్ నేపథ్యంలో నీట్ పరీక్షను ఎన్డీఏ రద్దు చేసింది. దీంతో ప్రదీప్ తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అక్క వెంటనే కత్తెరతో స్కార్ఫ్‌ను కత్తిరించింది. ఇంటి యజమాని, పోలీసులకు సమాచారం అందించింది. అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు నీట్ పరీక్షలో తన కుమారుడు బాగా రాణించాడని, 650 మార్కులు సాధిస్తానని చెప్పాడని తండ్రి రాజేష్ కుమార్ మేఘ్వాల్ పోలీసులకు తెలిపారు. ఈసారి ప్రభుత్వ వైద్య సీటు ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నాడని చెప్పారు. అయితే నీట్ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడని, డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ విలపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

