బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ అరెస్టు

న్యూఢిల్లీ: బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్‌ను ఢిల్లీ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో వేలం వేస్తున్నట్లు పోస్టు చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ కేసులో బెంగుళూరుకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి విశాల్ కుమార్‌తో పాటు ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఇవాళ ఢిల్లీ పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులకు చెందిన ఐఎఫ్ఎస్వో స్పెషల్ సెల్ అతన్ని అరెస్టు చేసింది.
బుల్లీ యాప్ కేసులో నీరజ్ ప్రధాన నిందితుడని డీసీపీ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. గిట్‌హబ్ ఫ్లాట్‌ఫామ్‌పై అతనే ఆ యాప్‌ను క్రియేట్ చేశాడన్నారు. ఆ యాప్‌కు చెందిన ప్రధాని ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ కూడా అతనేనన్నాడు. అతన్ని ఢిల్లీకి తీసుకువస్తున్నట్లు మల్హోత్రా తెలిపారు. నీరజ్ బిష్ణోయ్ వయసు 20 ఏళ్లు. అస్సాంలోని జోర్హట్ అతని స్వస్థలం. జోర్హట్లోని దిగంబర్ ప్రాంతంలో అతన్ని అరెస్టు చేశారు. భూపాల్‌లోని వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అతను ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

