తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పేరు వినగానే మనకు ఎత్తైన కొండలు, లోయలు, పచ్చని పచ్చికబయళ్లతో సర్వాంగ సుందరమైన ప్రకృతి రమణీయత కండ్ల ముందు కదలాడుతుంది. బీచ్లు, అడవులు, అరుదైన మొక్కలు, వృక్షాలు ఆకట్టుకుంటాయి. అలాంటి అరుదైన మొక్కల్లో నీలకురింజి మొక్కలు కూడా ఒకటి. ఈ మొక్కలకు పూసే నీలకురింజి పూల ( Neelakurinji Flowers ) అందాలను వీక్షించాలంటే రెండు కళ్లు చాలవు.
తాజాగా కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని శాంతపారా శాలోం కొండల్లో నీలకురింజి పూలు పూశాయి. దాంతో ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన కళ వచ్చింది. ఏటా చూసినా కనుచూపు మేరలో కనిపిస్తున్న నీలకురింజి పూల అందాలను వీక్షిస్తూ పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నీలకురింజి మొక్కలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయట. ఇవి 12 ఏండ్లకు ఒక్కసారే పూస్తాయట. పైగా ఈ మొక్కలు జీవితకాలంలో ఒక్కసారే పూతకు వస్తాయట.
Kerala: Shantanpara Shalom hills under Santhanpara Panchayat in Idukki are covered in hues of blue as Neelakurinji flowers bloom, which occurs once every 12 years pic.twitter.com/nXtFbiKt1w
— ANI (@ANI) August 2, 2021
ఈ మొక్కలు పన్నెండేండ్లు పెరిగి పూలు పూసిన తర్వాత చనిపోతాయట. అలా వాటి విత్తనాలతో మొలకెత్తే కొత్త మొక్కలు పూతకు రావడానికి మళ్లీ 12 ఏండ్లు పడుతుందట. అంటే ఈ పూలు మనకు ప్రతి ఏడాది జూలై-అక్టోబర్ నెలల మధ్యలో కనిపిస్తాయి. కానీ, ఒక మొక్క మాత్రం పన్నెండేండ్లకు ఒక్కసారే పూస్తుందన్నమాట. ఇక నీలం రంగులో ఉండటం వల్ల ఈ పూలకు నీలకురింజి పుష్పాలు అనే పేరు వచ్చిందట.
మలయాళంలో నీల అంటే నీలిరంగు అని, కురింజి అంటే పువ్వు అని అర్థమట. తాజాగా ఇడుక్కిలో పూసిన నీలకురింజి పూల వీడియోను ఓ జాతీయ మీడియా సంస్థ ట్విట్టర్లో షేర్ చేసింది. ట్విట్టర్ ఆ పోస్టు పెట్టిన రెండు గంటల్లోనే 8,500 మంది వీక్షించారు. నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. మరీ ఆ నీలకురింజి పూల అందాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.
#WATCH | Shantanpara Shalom hills under Santhanpara Panchayat in Kerala's Idukki are covered in hues of blue as Neelakurinji flowers bloom, which occurs once every 12 years pic.twitter.com/DyunepahAv
— ANI (@ANI) August 2, 2021