న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్‌ను తగ్గించాల్సి ఉందని ఒక రైతు నేత అన్నారు. రామ మందిరం వల్ల మోదీ గ్రాఫ్ పెరిగిందని ఆయన తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికలలోపు మోదీ గ్రాఫ్‌ను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. (Need To Bring Modi’s Graph Down) ఆ రైతు నేత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. కనీస మద్దతు ధరతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి ఢిల్లీ బాటపట్టారు. అయితే ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతంలో వారిని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కాగా, భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా సిద్ధూపూర్) నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఆయన విమర్శించారు. ‘మోదీ పాపులారిటీ పీక్‌లో ఉంది. రామమందిరం కారణంగా ఆయన గ్రాఫ్ పెరిగింది. మనకు తక్కువ సమయం ఉంది (2024 లోక్‌సభ ఎన్నికలు). మోదీ గ్రాఫ్‌ను తగ్గించాలి’ అని అన్నారు.
మరోవైపు రైతు నేత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. బీజేపీతోపాటు ఆ పార్టీకి చెందిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ దీనిపై స్పందించారు. రైతులకు ఎవరో మద్దతిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఇంత భారీ నిరసన చేపడితే ప్రధాని మోదీకి మద్దతివ్వడం ప్రజలు మానేస్తారా? అని ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.
"The popularity of Modi is at it's peak, His graph has gone up because of Ram Mandir. We have less time (2024 LS Elections). We have to bring graph of Modi down" – Farmer leader Jagjit Singh Dallewal exposes the political agenda behind #FarmerProtest2024 pic.twitter.com/SPwlsy9Ba3
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 15, 2024
#WATCH | On farmer leader Jagjit Singh Dallewal's, 'we have to bring graph of PM Modi down' remark, Haryana CM Manohar Lal Khattar says "This is a political statement. Will the people stop supporting PM Modi if such a huge protest is organised? A message is getting circulated in… pic.twitter.com/jmqD39evDH
— ANI (@ANI) February 15, 2024