జెంషెడ్పూర్: జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖార్సవాన్ జిల్లాలో.. రెండు సీట్ల విమానం అదృశ్యమైంది(Missing Aircraft). ఈ ఘటన మంగళవారం జరిగింది. అయితే ఆచూకీ లేని ఆ విమానం కోసం గాలింపు చేపడుతున్నారు. ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నది. చాందిల్ డ్యామ్‌లో ఆరుగురు సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ దళం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు విమాన ఆనవాళ్లను గుర్తించలేదు. విమానంలోని పైలెట్, ట్రైనీ పైలట్ సమాచారం.. ఏవియేషన్ కంపెనీ వద్ద ఉంటుందని డిప్యూటీ కమీషనర్ రవిశంకర్ శుక్ల తెలిపారు. రిజర్వాయర్‌లో శిథిలాలను చూసినట్లు స్థానికులు చెప్పడంతో చాందిల్ డ్యామ్‌లో గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆల్కెమిస్ట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఆ ఎయిర్‌క్రాఫ్ట్.. సెస్నా 152. జెంషెడ్పూర్లోని సొనారి ఏరోడ్రోమ్ నుంచి మంగళవారం 11 గంటలకు ఆ ఎయిర్‌క్రాఫ్ట్ ఎగిరింది.