Vice President Election : భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో ఎనిమిదరోజుల్లో ఎలక్షన్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్ (CP Radhkrishnan) కు తమ ఎంపీలంతా ఓటు వేసేలా చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగానే ఎన్డీఏ మిత్రపక్ష ఎంపీలకు ప్రధాని మోడీతో ఢిన్నర్తో ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సెమినార్ కూడా నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
సెప్టెంబర్ 9న జరుగబోయే ఉపరాష్ట్రపతి ఎంపిక ఎన్నికల్లో తమ పార్టీ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు వందకు వంద శాతం హాజరయ్యేలా చూడాలని బీజేపీ పావులు కదుపుతోంది. ‘మా ఎంపీలు వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనేలా చూసే బాధ్యతను కేంద్ర మంత్రులకు, రాష్ట్ర స్థాయిలో ఆయా ఎంపీలకు కట్టబెట్టాం. ఎన్డీఏ కూటమిలోని ఎంపీలంతా ఢిల్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత వీళ్లదే. ఎన్నికల తేదీ సమీపిస్తున్నందున మూడురోజుల పాటు ఎంపీలకు ప్రధానితో డిన్నర్‌తో పాటు ప్రత్యేక సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాం.
🚨 CP Radhakrishnan from Tamil Nadu is the NDA’s candidate for the Vice Presidential election. pic.twitter.com/r7dGSguDbe
— Indian Tech & Infra (@IndianTechGuide) August 17, 2025
ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియను అందరికీ వివరిస్తాం. బ్యాలట్‌ను సరిగ్గా మార్క్ చేయడం, ఎన్నికల అధికారి సూచనలను పాటించడం వంటివి ఎంపీలకు స్పష్టంగా చెబుతాం. క్రాస్ ఓటింగ్‌ను అడ్డుకోవడంతో పాటు చెల్లని ఓట్లు పడకుండా జాగ్రత్తపడంపైనే దృష్టి సారిస్తున్నాం. ఇవి సీక్రెట్ బ్యాలట్ ఎన్నికలు కావున ఎంపీలకు విప్ జారీ చేయడం లేదు’ అని పార్టీ వర్గాలు తెలిపాయి.
Opposition parties’ vice presidential candidate, former Supreme Court Judge Shri B. Sudershan Reddy, visited Mumbai and met with Shiv Sena (UBT) President and former Maharashtra CM Shri @uddhavthackeray at his residence, along with AICC General Secretary Shri @NasirHussainINC and… pic.twitter.com/I8DvEosgto
— Congress (@INCIndia) August 29, 2025
అనారోగ్య కారణాలతో జైదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఎన్డీఏ తమ అభ్యర్థిగా మాజీ గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఎంచుకోగా.. ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్ రెడ్డిని బలపరిచింది. అయితే.. ప్రస్తుతం ఎన్డేఏకు 425 మంది ఎంపీల బలం ఉంది. వీళ్లంతా గంపగుత్తగా రాధాకృష్ణన్‌కే ఓటే వేశారంటే నూతన ఊపరాష్ట్రపతిగా ఆయన కొలువుదీరడం ఖాయం. అందుకే.. ఎన్నికలకు ముందు తమ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనుకుంటోంది మోడీ బృందం. సెప్టెంబర్ 9 న ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరుగనుంది. 391 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి.. ఎన్డీఏ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి.
#Maharashtra governor #CPRadhakrishnan (68) is all set to be India’s next vice-president.
Read more in today’s Times Of India print edition 📰https://t.co/JsjwOapTXf pic.twitter.com/OYzWW13fls
— The Times Of India (@timesofindia) August 18, 2025