న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ(ఎన్డీఏ, ఎన్ఏ 2)-2024 పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉండే ఓటీఆర్ వేదికపై రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది రెండో సెషన్లో భాగంగా ఎన్డీఏ 370, ఎన్ఏ 34 ఉద్యోగాలకు మొత్తంగా 404 ఖాళీలకు సంబంధించి ఉద్యోగ ప్రకటన విడుదలైంది.