Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎన్డీఏ.. బీజేపీపై కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదు
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎన్డీఏ ఎంపీలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీపై ఫిర్యాదు ఇచ్చారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ రాహుల్ గాంధీ తోసివేయడంతో.. ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఇవాళ జరిగిన ఘటన పట్ల ఎన్డీఏ ఎంపీలు.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనురాగ్ ఠాకూర్, బాన్సురి స్వరాజ్తో పాటు మరో ఎంపీ.. పోలీసు స్టేషన్కు వెళ్లి రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదు చేశారు. రాహుల్ గాంధీ భౌతిక దాడి జరిపారని, రెచ్చగొట్టినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఠాకూర్, స్వరాజ్తో పాటు టీడీపీ ఎంపీ కూడా వెళ్లారు. భౌతిక దాడి ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై ఫిర్యాదు ఇచ్చినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
#WATCH | Delhi | BJP MP Bansuri Swaraj says, “…The attitude is not only indecent but it is also criminal and that is why we all have come here today (at the police station) and filed a complaint, where it has been clearly stated that the security forces repeatedly requested… pic.twitter.com/syjVSCw99h
— ANI (@ANI) December 19, 2024
పార్లమెంట్ మకర ద్వారం వద్ద ఇండియా కూటమి, బీజేపీ ఎంపీలు ఇవాళ ఘర్షణకు దిగారు. పార్లమెంట్ లోపలికి వెళ్తున్న ఇండియా కూటమి నేతలకు అడ్డుగా బీజేపీ ఎంపీలు నిలబడ్డారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. అయితే అక్కడ ఉన్న ఎంసీ ప్రతాప్ సారంగీ గాయపడ్డారు. రాహుల్ గాంధీ నెట్టివేయడం వల్లే తాను కిందపడిపోయినట్లు సారంగీ వెల్లడించారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎంపీ ముకేశ్ రాజ్పుత్లు కూడా గాయపడ్డారు. సారంగీ, రాజ్పుత్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
#WATCH | Delhi: A delegation of Congress MPs including women MPs at Parliament Street Police station to complain against the BJP.
More details awaited. pic.twitter.com/jJtsa948oq
— ANI (@ANI) December 19, 2024
కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీపై ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. దీంట్లో ఆ పార్టీ మహిళా ఎంపీలు కూడా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

