న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు. 2018 ఆగస్టు 7న ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ పదవిలో 7 ఏండ్లు కొనసాగారు. మూడు టర్మ్‌లు చైర్‌పర్సన్‌గా పనిచేయటం తనకెంతో గర్వకారణమని, సుదీర్ఘకాలం కమిషన్‌లో పనిచేసిన తాను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రేఖా శర్మ చెప్పారు. ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ హయాంలో, మణిపూర్‌లో మహిళలపై లైంగికదాడులు, హత్యలపై ఎన్సీడబ్ల్యూ పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.