ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన జితేంద్ర అవద్ (Jitendra Awhad)ను ఆ పార్టీ నియమించింది. పార్టీ చీఫ్ విప్‌గా కూడా ఆయన వ్యవరిస్తారని పేర్కొంది. ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జితేంద్ర అవద్ స్పందించారు. వాటికనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కాగా, ఇప్పటి వరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తొమ్మది మంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు. ఈ నేపథ్యంలో అజిత్ పవర్ డిప్యూటీ సీఎంగా, ఆయన వర్గం ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రతిపక్ష నేత పదవి తనకు వద్దని, ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గత నెల 21న అజిత్ పవార్ స్పష్టం చేశారు. అలాగే పార్టీలో కీలక పదవి కావాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఈ నెల 6న ముంబైలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అజిత్ పవార్‌తో సహా కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్‌పై చర్చించనున్నారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరడంపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆ నేతల పోస్టర్లపై నల్ల సిరా చల్లారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
#WATCH | Mumbai, Maharashtra: Dr Jitendra Awhad, NCP leader on being appointed as the Leader of the Opposition, says, "The day has just started, we will think about it and whatever happens we will take decision accordingly…" pic.twitter.com/SNsu53uHTY
— ANI (@ANI) July 2, 2023
#WATCH | Mumbai: NCP supporters smear black ink on the posters of party leaders who joined the NDA government today. pic.twitter.com/JOW74kSCVj
— ANI (@ANI) July 2, 2023