Maharashtra : మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన అజిత్ పవార్ (Ajit Pawar) దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCPని నడిపించేది ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పవార్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే.. కొందరు సీనియర్ నాయకులు మాత్రం ఆయన భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar) పేరును ప్రతిపాదిస్తున్నారు. అజిత్ దాదా వారసత్వాన్ని కొనసాగించేందుకు సునేత్రనే సరైన వ్యక్తి అని, అందుకని ఆమెను ఉపముఖ్యమంత్రిగా చూడాలని వారందరూ ఆశపడుతున్నారు.
జడ్జీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా బారామతిలో విమానం కుప్పకూలడంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. రాజకీయ చతురుడిగా పేరున్న అజిత్ మరణంతో ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు అశావహులు పోటీలో ఉన్నారు. కానీ, సీనియర్లు అజిత్ భార్య సునేత్ర వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమెను డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారు. ఎన్సీపీ నాయకుడు, మంత్రి నరహరి జిర్వాల్ గురువారం పీటీఐతో మాట్లాడుతూ.. ‘సునేత్రను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రజులు కోరుకుంటున్నార’ని తెలిపాడు.
#WATCH | Baramati | Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar & Rajya Sabha MP, mourns at the last rites of her husband pic.twitter.com/cuOP3Zt3gr
— ANI (@ANI) January 29, 2026
ఇప్పటికే సీనియర్లు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండు, సునీల్ తట్కరేలు సునేత్రను పరామర్శించి భవిష్యత్ ప్రణాళికలపై మంతనాలు జరిపారు. అజిత్ పవార్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన బారామతి నియోజకవర్గం నుంచి సునేత్రను బరిలో ఉంచాలని.. ఆపై ఆమెకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలని వారు భావిస్తున్నారు. ఎన్సీపీ సీనియర్లు త్వరలోనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి ఆయనతో ఇదే విషయమై చర్చించేందుకు సిద్ధముతున్నారు.
For the first time, I saw Devendra Fadnavis in absolute shock, completely broken and helplessness. His body language today spoke volumes.
Sunetra Tai’s grief is unimaginable.
May God give the Pawar family the courage and strength to survive this tragic time. 🙏 pic.twitter.com/iejKjCpZRd
— Truth Defenders (@TruthDefenders_) January 28, 2026
రాబోయే మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలా ఎన్సీపీ(ఎస్పీ)తో అజిత్ పవార్ సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు ఆయన మరణంతో ఏర్పడిన శూన్యతను భర్తీ చేసే నాయకుడి అవసరం ఎన్సీపీకి ఎంతో ఉంది. దాంతో ప్రస్తుతం ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ప్రఫుల్ పటేల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొనే అవకాశముంది.
🚨 BIG POLITICAL DEVELOPMENT:
Senior NCP leader Praful Patel met Sunetra Pawar, sparking major political buzz.
Leaders Chhagan Bhujbal and Sunil Tatkare also held meetings, indicating intense internal discussions.
Sources suggest Praful Patel could become the party president,… pic.twitter.com/8MHVQZfVU4— RashtraVaani (@RashtraVaani25) January 29, 2026
జనవరి 28న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఇద్దరు పైలట్లు, ఫ్లైట్ సహాయకురాలు, పవార్ వ్యక్తిగత సహాకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గురువారం అధికారిక లాంఛనాలతో బారమతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించారు.