Anti – EVM event : దేశంలో ఎన్నికలు (Elections) ఎప్పుడు, ఎక్కడ జరిగినా ఈవీఎంల (EVMs) ట్యాంపరింగ్ అంశం తెరపైకి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట ఈవీఎంల ఊసెత్తడం లేదని, ఓడిన చోట మాత్రం ఈవీఎంలను తప్పుపడుతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది.
ఈ నేపథ్యంలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. సోలాపూర్ జిల్లాలోని మర్కడ్వాడి గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో శరద్‌పవార్‌తోపాటు ఎన్సీపీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. శరద్‌పవార్ ముందు నుంచి కూడా ఈవీఎంలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు.
అందులో భాగంగానే ఇవాళ సోలాపూర్‌లో ఈవీఎంలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్సీపీ నేతలంతా నిరసన కార్యక్రమంలో ఉన్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Maharashtra: NCP-SCP chief Sharad Pawar and other leaders of the party attend an anti-EVM event at Markadwadi village in Solapur district.
(Video: NCP-SCP/YouTube) pic.twitter.com/J9iacQle31
— ANI (@ANI) December 8, 2024