న్యూఢిల్లీ: ఇటీవల మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ సహా మరో తొమ్మిది మందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఎన్సీపీ ప్రకటించింది. గురువారం శరద్ పవార్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఆ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ సమావేశానికి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు ఈ సమావేశం చట్ట విరుద్ధమని ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.