Ajit Pawar : ఉల్లి రైతుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పాలక ఎన్డీయేను దెబ్బతీసిందని డిప్యూటీ సీఎం, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు అజిత్ పవార్ అన్నారు. తాము ఇటీవల ఢిల్లీలో ఉన్నప్పుడు ఉల్లి ధరలకు సంబంధించిన అంశాలు ఎన్నికలను ఎలా ప్రభావితం చేశాయనే అంశంపై పీయూష్ గోయల్, అమిత్ షా సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించామని చెప్పారు.
ఉల్లి రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో తాము భారీ మూల్యం చెల్లించుకున్నామని వివరించారు. ఉల్లి రైతులు, వినియోగదారులు అందరికీ మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తాము కేంద్రానికి చెబుతూనే ఉన్నామని తెలిపారు. ఎట్టకేలకు తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి పరిగణనలోకి తీసుకుందని తాము భావిస్తున్నామని చెప్పారు.
ఉల్లి ధరలు, సరఫరా అంశాలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర మహారాష్ట్రలోని రావర్, జల్గాం మినహా మిగిలిన ప్రాంతాల్లో తాము తీవ్రంగా నష్టపోయామని వివరించారు. పుణే, అహ్మద్‌నగర్, నాసిక్, షోలాపూర్ ప్రాంతాల్లో ఉల్లి రైతులు అధికంగా ఉంటారని, ఉల్లి ధరలకు సంబంధించిన అంశాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అజిత్ పవార్ పేర్కొన్నారు.
Read More :
Komati Reddy | త్వరలోనే 13,000 టీచర్ పోస్టులు భర్తీ : మంత్రి కోమటిరెడ్డి