న్యూఢిల్లీ: నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ)లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ) ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. వాస్తవానికి ఈ పరీక్ష బుధవారం కొన్ని సెంటర్లలో ప్రారంభమైంది.
కొన్ని సాంకేతిక కారణాల వల్ల అన్ని పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను పూర్తిగా నిర్వహించలేకపోయారు. దీంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడిస్తారు.