Jihadi Drug: 182 కోట్ల ఖరీదైన జిహాదీ డ్రగ్ స్వాధీనం: కేంద్ర మంత్రి అమిత్ షా
Jhadi Drug: దేశంలో తొలిసారి జిహాదీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. అంతర్జాతీయ నార్కోటిక్స్ ట్రాఫిక్కింగ్ బృందంపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. కాప్టగాన్ అనే ఆ డ్రగ్ విలువ మార్కెట్లో సుమారు 182 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దేశంలో తొలిసారి జిహాదీ డ్రగ్(Jihadi Drug)ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ నార్కోటిక్స్ ట్రాఫిక్కింగ్ బృందంపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. కాప్టగాన్ అనే ఆ డ్రగ్ విలువ మార్కెట్లో సుమారు 182 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ పట్టివేతకు ఆపరేషన్ రేజ్‌పిల్ అనే కోడ్ నేమ్ పెట్టారు. డ్రగ్ ట్రాఫిక్కింగ్కు పాల్పడిన విదేశీ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ కన్సైన్మెంట్ ను పశ్చిమాసియా దేశాలకు తరలిస్తున్నారు. ఇండియాను ట్రాన్సిట్ మార్గంలో వాడేందుకు ప్రయత్నించారు.
అమిత్ షా తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని చెప్పారు. డ్రగ్ ఫ్రీ ఇండియా కావలన్న లక్ష్యంతో మోదీ సర్కారు పనిచేస్తోందని, దానిలో భాగంగానే అరెస్టులు జరిగినట్లు వెల్లడించారు. ఆపరేషన్ రేజ్‌పిల్ ద్వారా జిహాదీ డ్రగ్‌ను పట్టుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఇండియాలోకి ఎంటరయ్యే ప్రతి గ్రాము డ్రగ్‌ను విడిచిపేట్టేది లేదన్నారు.
క్యాప్టగాన్ అనేది అంఫిటమైన్ తరహా ఉత్ప్రేరకం. ఇది నిషేధిత డ్రగ్. పశ్చిమాసియాలోని మిలిటెంట్ గ్రూపులు, వ్యవస్థీకృత నేరగాళ్లు దీన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కన్సైన్మెంట్ వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను చేధించనున్నట్లు చెప్పారు.అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపనున్నట్లు చెప్పారు.
Modi govt is resolved for a ‘Drug-Free India’.
Glad to share that through ‘Operation RAGEPILL’, our agencies have achieved the first-ever seizure of Captagon, the so-called “Jihadi Drug”, worth ₹182 crore.
The busting of the drug consignment destined for the Middle East and…
— Amit Shah (@AmitShah) May 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- Captagon
- jihadi drug
- NCB
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

