Naxals | విద్యార్థిని సహా ఐదుగురిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు
School girl | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సల్స్ (Naxals) ఐదుగురిని ఎత్తుకెళ్లారు. జిల్లాలోని కొన్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని బటెర్ గ్రామంపై మావోయిస్టులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను బలవంతంగా తమవెంట

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సల్స్ (Naxals) ఐదుగురిని ఎత్తుకెళ్లారు. జిల్లాలోని కొన్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని బటెర్ గ్రామంపై మావోయిస్టులు (Maoists) శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. వారిలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉన్నది. కాగా, వారిని ఎందుకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియలేదని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారని వెల్లడించారు.
కొన్నిసార్లు సమావేశాల సందర్భంగా మావోయిస్టులు గ్రామస్తులను తీసుకెళ్తుంటారని చెప్పారు. ఎత్తుకెళ్లినవారిని విడుదల చేయాలని బస్తర్ రీజియన్‌లోని గిరిజన సంఘాలు మావోయిస్టులను కోరాయన్నారు. గత జూలైలో కుందేడ్‌కు చెందిన ఎనిమిది మందిని ఎత్తుకెళ్లారని, రెండు మూడు రోజుల తర్వాత వారిని విడుదల చేశారని శర్మ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

