Naxalites : ఛత్తీస్గఢ్ (Chattishgarh) లో మరోసారి భారీగా నక్సలైట్లు (Naxalites) లొంగిపోయారు. కొన్ని రోజుల క్రితమే 70 మంది మావోయిస్టులు (Maoists) మూకుమ్మడిగా లొంగిపోగా, తాజాగా మరో 26 మంది సరెండరయ్యారు. దంతెవాడ (Dantewada) పోలీసుల ముందు మావోయిస్టుల లొంగుబాటు జరిగింది.
లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురిపై రివార్డు కూడా ఉంది. అంటే ఆ ముగ్గురిని అరెస్టు చేసిన వారికి నగదు బహుమతిగా ఇస్తారు. కాగా లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడ పోలీసులు మీడియాకు చూపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Chhattisgarh | 26 Naxalites, including three with carrying rewards on their arrest, surrender before Dantewada Police
(Video source: Dantewada Police) pic.twitter.com/5Riienurui
— ANI (@ANI) April 7, 2025