బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను నక్సలైట్లు ఉరి తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జప్పెమర్క గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని, మడ్వి సుజ, పోడియం కోసలను మంగళవారం అపహరించి తీసుకెళ్లారు. జన అదాలత్‌ను నిర్వహించిన అనంతరం మడ్వి, పోడియంలను చెట్టుకు ఉరి వేసి హత్య చేశారు. ఈ హత్యలకు తమదే బాధ్యత అని భైరంగఢ్ ఏరియా మావోయిస్టు కమిటీ ప్రకటించింది. వీరిద్దరూ పోలీసు ఇన్ఫార్మర్లని ఆరోపించింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
న్యూఢిల్లీ: రష్యా సైన్యం నుంచి 45 మంది భారతీయులకు విముక్తి లభించినట్లు ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ గురువారం తెలిపింది. మరో 50 మందికి విముక్తి కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో రష్యాలో పర్యటించినపుడు భారతీయ సైనికులను విడుదల చేస్తామని రష్యా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తప్పుడు ప్రలోభాలకు గురై, తమ సైన్యంలో చేరి, నిర్బంధం వల్ల ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను డిశ్చార్జ్ చేస్తామని రష్యా చెప్పింది. ఈ హామీ మేరకు 45 మంది భారతీయులను సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసింది.