Amit Shah: బొకారోలో నక్సలిజం అంతమైంది: అమిత్ షా
Amit Shah: జార్ఖండ్‌లోని బొకారోలో నక్సలిజం అంతమైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ ముగ్గరు నక్సల్స్ హతమైన ఘటన నేపథ్యంలో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తర జార్ఖండ్‌లోని బొకారో ప్రాంతంలో నక్సలిజం పూర్తిగా నశించినట్లు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో యావత్ దేశం నక్సల్స్ సమస్య నుంచి విముక్తి పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ వివరాలను ఆయన వెల్లడించారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో మేజర్ సక్సెస్‌ను సాధించామన్నారు.
Hazaribagh, Jharkhand | Sahdeo Soren, a Central Committee Member of CPI(Maoist) carrying Rs 1 Crore on his head, killed in an encounter with a joint team of CoBRA battalion, Giridih and Hazaribagh Police. Naxal commanders Raghunath Hembram@Chanchal and Birsen Ganjhu@Ramkhelawan… pic.twitter.com/xfHThf1FW8
— ANI (@ANI) September 15, 2025
సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా బెటాలియన్ , రాష్ట్ర పోలీసులు ఈ సక్సెస్‌లో భాగస్వామ్యులైనట్లు తెలిపారు. తలపై కోటి రూపాయల నజరానా ఉన్న నక్సల్ కమాండర్ సీసీఎం సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేశ్‌ను హతమార్చినట్లు ఆయన చెప్పారు. దీనికి తోడు మరో ఇద్దరు నక్సల్స్‌ను కూడా హతమార్చామన్నారు. రఘునాథ్ హెంబ్రమ్ అలియాస్ ఛంచాల్, బిర్సేన్ గంజూ అలియాస్ రామ్కేల్వాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ ద్వారా బొకారో ప్రాంతంలో ఉన్న నక్సలిజం అంతమైనట్లు షా వెల్లడించారు. యావత్ దేశం కూడా త్వరలో విముక్తి చెందుతుందన్నారు.
आज झारखंड के हजारीबाग में CRPF की कोबरा बटालियन और राज्य पुलिस की जॉइंट टीम को एंटी नक्सल ऑपरेशन में बड़ी कामयाबी मिली है। इस अभियान में ₹1 करोड़ का इनामी, कुख्यात नक्सली कमांडर सीसीएम सहदेव सोरेन उर्फ परवेश को ढ़ेर कर दिया गया है। साथ ही, दो अन्य इनामी नक्सलियों- रघुनाथ…
— Amit Shah (@AmitShah) September 15, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

