న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో శనివారం భారతీయ నౌకాదళం ప్రారంభించిన లైవ్ ఫైరింగ్ డ్రిల్స్ (సన్నాహక కాల్పుల కసరతు)్త ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్నది. ఈ డ్రిల్స్‌లో నౌకాదళ సిబ్బంది వాస్తవిక యుద్ధ రంగంలో ఉపయోగించే మందుగుండునే ఉపయోగిస్తారు. యుద్ధ సన్నద్ధతను, ఆయుధాల సామర్థర్థ్యాన్ని పరిశీలించే నిమిత్తం ఇలాంటి డ్రిల్స్ జరుగుతాయి. శనివారం ఉదయం నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని నరేంద్ర మోదీతో గంటసేపు సమావేశమై తమ నిర్వహణ సంసిద్ధతను, అరేబియా సముద్రంలో జరుగుతున్న నేవీ సిబ్బంది ల్రైవ్ ఫైరిగ్ డ్రిల్స్ గురించి వివరించారు.