Navneet Rana | అసదుద్దీన్ ఒవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయండి.. రాష్ట్రపతికి నవనీత్ రాణా లేఖ
Navneet Rana | హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి బుధవారం లేఖ రాశారు.
Navneet Rana | హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి బుధవారం లేఖ రాశారు. ఇటీవల లోక్‌సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ అంటూ నినదించిన విషయం తెలిసిందే. ప్రమాణం స్వీకారం సందర్భంగా పాలస్తీనా పేరును లేవనెత్తి.. భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారంటూ లేఖలో ప్రస్తావించారు. అయితే, తన ఇమాండ్కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలను ఆమె ఉదహరించారు.
ఈ మేరకు లోక్‌సభ ఒవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్ ఒవైసీ జై భీమ్.. జై తెలంగాణ.. జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సభలో ఎంపీ వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులతోపాటు పలువురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ స్పందిస్తూ.. ఒవైసీ వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

