Loksabha Elections 2024 : ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తరపున బీజేడీ నేత వీకే పాండ్యన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ బీజేడీ నేతలతో పాటు విపక్ష నేతలు గుప్పిస్తున్న ఆరోపణలపై సీఎం స్పందించారు. ఇవి నిరాధార ఆరోపణలని నవీన్ పట్నాయక్ తోసిపుచ్చారు.
ఈ ఆరోపణలపై తాను గతంలోనూ స్పందించానని, ఇవి పాత ఆరోపణలేనని, వీటిలో పస లేదని ఆయన పేర్కొన్నారు. విపక్షాలు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగడంపై ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్ పట్నాయక్ స్పందిస్తూ దేశంలో వారి ప్రతిష్ట దిగజారడంతో దిక్కుతోచని స్దితిలో వ్యక్తిగత విమర్శలకు తెగబడుతున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో, జాతీయ స్ధాయిలో ఆయా పార్టీలు ఉనికి కోల్పోతున్న పరిస్ధితుల్లో అసహనంతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు తన ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే అస్యత ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉండటం వల్లే మండుటెండల్లోనూ అలుపెరుగకుండా ఎన్నికల ప్రచారం చేపడుతున్నానని చెప్పారు.
Read More :
Crop Insurance | పంట నష్టపోయినా పరిహారం కష్టమే.. నూతన బీమా పథకంలో శాస్త్రీయత శూన్యం!