Crop Insurance | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రైతు యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే పంట నష్టం జరిగినప్పుడు రైతుకు న్యాయం జరుగుతుంది. కానీ, కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతోపాటు రాష్ట్రం అమలు చేయబోతు న్న పంటల బీమా పథకంలో ఈ మూలసూత్రం లోపించింది.రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఈ వానకాలం సీజన్ నుంచి 10 పంటలకు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారంటూ జిల్లా వ్యవసాయాధికారులు పెదవి విరుస్తున్నారు.
ఫసల్ బీమా పథకంలో మార్పులు చేసి, రైతును యూనిట్‌గా పరిగణించి రాష్ట్రంలోని ప్రతి రైతుకు మేలు జరిగేలా చూస్తామని రేవంత్‌రెడ్డి సర్కారు గొప్పలు చెప్పింది. కానీ, గ్రామం, మండలం, జిల్లా యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ విధానం వల్ల రైతులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భౌగోళిక పరిస్థితులను, ప్రధాన పంటల సాగునుపరిగణనలోకి తీసుకోకుండా గ్రామం, మండలం, జిల్లా యూనిట్‌గా పరిగణించి 10 పంటలకు ఫసల్ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.వీటిలో వరి పంటకు మాత్రమే గ్రామా న్ని యూనిట్‌గా పరిగణిస్తున్నా రు. మిగిలిన పంటలకు మండలాన్ని, జిల్లాను యూనిట్‌గా తీసుకోవడంతో రైతులకు అనేక ఇబ్బందులు తలెత్తడం ఖాయం గా కనిపిస్తున్నది.
పంట నష్టంపై జరిపే సర్వేలో ఒక్కో రైతుకు సంబంధించిన పంట నష్టాన్ని అంచనా వేస్తారు. దీంతో పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం దక్కుతుంది.
గ్రామాన్ని యూనిట్‌గా పరిగణిస్తే..
గ్రామంలో ఒకవైపు ఎక్కువ, మరోవైపు తక్కువ పంట నష్టం జరిగితే మొత్తం గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని లెక్కిస్తారు. ఇందులో 33% పంట నష్టం వాటిల్లినట్టు నిర్ధారణ అయితేనే రైతులకు పరిహారాన్ని అందజేస్తారు.
ఒక గ్రామంలో పంటలు దెబ్బతిని, మరికొన్ని గ్రామాల్లో పంటలు బాగానే ఉంటే నష్టపోయిన రైతులకు పరిహారం అందదు.
రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరువుతుండటంతో కార్యక్రమ నిర్వహణను సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. పరేడ్‌గ్రౌండ్‌లోని ప్రధాన వేడుకల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలతో సమీక్షించారు. కార్యక్రమానికి కనీసం 25 వేల మంది హాజరయ్యేలా అధికారులకు ప్రభుత్వం టార్గెట్ విధించినట్టు తెలిసింది. హైదరాబాద్ నగరం నుంచే ఎక్కువ మందిని సమీకరించేలా మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అధికారులతో సమన్వయం చేస్తున్నారు. గత ప్రభుత్వం కంటే భారీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు ఒక అధికారి చెప్పారు. పరేడ్‌గ్రౌండ్‌లో ఆరు గ్యారెంటీలపై ఐఅండ్‌పీఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.