Naveen Patnaik: బీజేపీకి సపోర్టు ఇచ్చేది లేదు.. రాజ్యసభ ఎంపీలకు పట్నాయక్ దిశానిర్దేశం
Naveen Patnaik: బీజేపీకి సపోర్టు ఇవ్వవద్దు అని రాజ్యసభ ఎంపీలకు నవీన్ పట్నాయక్ దిశానిర్దేశం చేశారు. రాజ్యసభలో బలమైన ప్రత్యర్థిగా ఎదగాలని ఆయన తమ ఎంపీలకు తెలిపారు.
భువనేశ్వర్: తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలతో ఇవాళ బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్(Naveen Patnaik) సమావేశం నిర్వహించారు. జూన్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో.. బలమైన,చురుకైన ప్రతిపక్షంగా రాజ్యసభలో వ్యవహరించాలని తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కూడా సభలో కేంద్ర సర్కారును నిలదీయాలన్నారు. నవీన్ పట్నాయక్‌తో జరిగిన సమావేశం గురించి రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మీడియాకు వివరించారు. ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాత్రమే మాట్లాడరని, ఒడిశా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తే, అప్పుడు బీజేపీ సర్కారుపై తీవ్ర పోరాటం చేస్తామన్నారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను లేవనెత్తనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ బలహీనంగా ఉందని, బ్యాంకులకు చెందిన బ్రాంచీలు కూడా తక్కువగా ఉన్నాయని బీజేడీ ఎంపీ తెలిపారు. బొగ్గు రాయాల్టీని కూడా గత పదేళ్ల నుంచి కేంద్రం విస్మరించిందని అన్నారు. తాజాగా ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఒక్క సీటు కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే.
BJD President & Leader of Opposition @Naveen_Odisha today chaired a meeting of party’s Rajya Sabha MPs at Naveen Nivas
MPs have been directed to vociferously raise issues affecting the State’s interests in the Upper House
BJD now has 9 Rajya Sabha members pic.twitter.com/ssuoULUqnU
— Soumyajit Pattnaik (@soumyajitt) June 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

