బుధవారం 27 మే 2020
National - May 08, 2020 , 13:15:27

ఎల్జీ పాలిమ‌ర్స్‌కు నోటీసులు.. 50 కోట్లు డిపాజిట్ చేయాల‌న్న ఎన్జీటీ

ఎల్జీ పాలిమ‌ర్స్‌కు నోటీసులు.. 50 కోట్లు డిపాజిట్ చేయాల‌న్న ఎన్జీటీ

హైద‌రాబాద్‌: విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఎల్జీ పాలిమ‌ర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘ‌టన‌లో మొత్తం 11 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.  ఆ ప్ర‌మాదంలో సుమారు వెయ్యి మందికిపై అస్వ‌స్థుల‌య్యారు.  అయితే ఈ ఘ‌ట‌న ప‌ట్ల నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ స్పందించింది. ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ‌కు ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది.  ఎన్జీటీతో పాటు ప‌ర్యావ‌ర‌ణ‌, అడవుల మంత్రిత్వ‌శాఖ‌, సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)లు కూడా ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ‌కు నోటీసులు ఇచ్చాయి.  అయితే ప్రాథ‌మికంగా న‌ష్ట‌ప‌రిహారం కింద‌ 50 కోట్లు డిపాజిట్ చేయాల‌ని  ఎల్జీ పాలిమ‌ర్స్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. 

ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఏపీ సీఎం జ‌గ‌న్‌ రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి రూ.10 లక్షలు, రెండు నుంచి మూడు రోజు లు దవాఖానలో ఉండే పరిస్థితి ఉన్నవారికి రూ.లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైనవారికి రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘట నపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. logo