Assembly Speaker | ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్సీ పార్టీ భారీ విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరింది.
ఈ క్రమంలోనే దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకున్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ (Jammu Kashmir Assembly Speaker)గా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్ రహీమ్ రాథర్ (Abdul Rahim Rather) ఎన్నికయ్యారు. సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సమక్షంలో ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్.. అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ పేరును ప్రతిపాదించారు. కాగా, అబ్దుల్ రహీమ్ రాథర్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బుద్గాం జిల్లాలోని చరార్-ఇ-షరీఫ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేడు తొలిరోజు సభను ఉద్దేశించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగించనున్నారు.
#WATCH | Srinagar, J&K: Senior NC MLA Abdul Rahim Rather elected as the Speaker of J&K Assembly.
CM Omar Abdullah and Protem Speaker Mubarak Gul congratulate him as he takes his Chair in the House. pic.twitter.com/o1dFcnr0Ia
— ANI (@ANI) November 4, 2024
#WATCH | Srinagar, J&K: Senior NC MLA Abdul Rahim Rather elected as the Speaker of J&K Assembly, Protem Speaker Mubarak Gul announces it in the House. Motion moved and passed. pic.twitter.com/2fsdz5DMLO
— ANI (@ANI) November 4, 2024
Also Read..
Bus Accident | లోయలో పడిపోయిన బస్సు.. ఐదుగురు మృతి
Air Pollution | డేంజర్ బెల్స్.. ఢిల్లీలో 400 మార్క్‌ను దాటిన గాలి నాణ్యత
Hindu Temple | కెనడాలో హిందూ ఆలయంపై దాడి.. ట్రూడో ఏమన్నారంటే..?