న్యూఢిల్లీ, నవంబర్ 29: దాదాపు 40 ఏండ్ల తర్వాత భారత వ్యోమగామి అంతరిక్షంలో అడుగుపెట్టబోతున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ త్వరలో చేపట్టనున్న మిషన్ ద్వారా భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోవియట్ యూనియన్ 1984లో సూయజ్ టీ-11 రాకెట్ ద్వారా భారత వ్యోమగామి రాకేశ్ శర్మను అంతరిక్షంలోకి పంపిన తర్వాత, మన దేశం నుంచి మరొకరు అంతరిక్షంలో అడుగుపెట్టలేదు. మళ్లీ ఇన్నేండ్లకు భారత వ్యోమగామిని ఐఎస్ఎస్కు తీసుకెళ్లేందుకు ‘నాసా’తో ఒప్పందం కుదిరినట్టు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.