న్యూఢిల్లీ: కనువిందు చేస్తున్న చందమామ కొత్త ఫోటో(Moon Photo)ను నాసా రిలీజ్ చేసింది. పసిఫిక్ తీరంలో.. తెల్లటి మబ్బులు.. నీలి రంగు ఆకాశం మధ్య.. ఆ నెలరేడు అద్భుతంగా దర్శనం ఇస్తున్న ఫోటోను నాసా తన సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేసింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న మాథ్యూ డామ్నిక్ వ్యోమగామి ఆ ఫోటో తీశాడు. అంతరిక్ష అద్భుతాలను ఎప్పటికప్పుడు రిలీజ్ చేసే నాసా ఇప్పుడు తన కొత్త ఫోటోతో అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. పసిఫిక్ సముద్ర తీరం నుంచి చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడో చూడండి అంటూ మాథ్యూ తన ట్వీట్లో తెలిపారు. హవాయి వద్ద తుఫాన్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో.. చంద్రుడి అందాలు ఫోటోకు చిక్కినట్లు చెప్పాడు. తుఫాన్ దాటిన తర్వాత మూన్ ప్రత్యక్షమైనట్లు పేర్కొన్నారు.
The moon setting over the Pacific.
Went to the cupola to shoot Tropical Storm Hone near Hawaii but right after we passed by the storm the moon started to set.
400mm, ISO 500, 1/20000s shutter speed, f2.8, cropped, denoised. pic.twitter.com/YtboVnRNpF
— Matthew Dominick (@dominickmatthew) August 24, 2024